జనవరి 19న డాక్ అదాలత్
హైదరాబాద్, డిసెంబర్ 18, 2015
తపాలా సేవలకు సంబంధించి సమస్యలు,ఫిర్యాదులను స్వీకరించేందుకు వచ్చే నెల (జనవరి) 19వ తేదీన 92వ డాక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లుహైదరాబాద్ లోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలోతెలిపింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తపాలా సేవలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను శ్రీ వి.వి.వి.శివ ప్రసాదరావు,అసిస్టెంట్ డైరెక్టర్ (ఎల్.సి & పీ.జీ), ఆఫీస్ ఆఫ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ - హైదరాబాద్- 500 001 కు పంపించాలని పేర్కొంది. లేఖలు,ఎన్వెలప్ లపై 92వ డాక్ అదాలత్ అన్న పేరును స్పష్టంగారాయాలని సూచించింది. ప్రజలు ఈ నెల 30వ తేదీ వరకు లేఖలు పంపించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కార్యాలయం కన్ఫరెన్స్ హాల్ (2వ అంతస్తు)లో జనవరి 19వ తేదీ ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్ ఉంటుందనివివరించింది.