కరవుప్రభావితరాష్ట్రాల్లోఉపాధిపనిదినాలు150 రోజులకుపెంపు
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్నుంచికరవుపైవిజ్ఞాపనరాలేదు
2022నాటికి2.95 కోట్లమందికిఇళ్లనిర్మాణం
రుర్బన్మిషన్కింద300 గ్రామీణక్లస్టర్లఏర్పాటు
కేంద్ర,గ్రామీణాభివృద్ది,పంచాయతీరాజ్,తాగునీరు,పారిశుద్ధ్యశాఖమంత్రిచౌదరిబీరేందర్సింగ్ వెల్లడి
హైదరాబాద్, నవంబరు 18, 2015
దేశంలోకరవు ప్రభావిత రాష్ట్రాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను100 రోజుల నుంచి 150 రోజులకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కరవు పరిస్థితులకు సంబంధించినవినతులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉపాధి పని దినాలను 150 రోజులకుపెంచేందుకు నిర్ణయించామన్నారు. మహారాష్ట్ర, ఒడిశాల నుంచి కూడా తాజాగా కరవుపైవిజ్ఞాపనలు వచ్చాయని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కరవుకుసంబంధించి ఎలాంటి విజ్ఞప్తులు అందలేదని పేర్కొన్నారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేవిషయంలో రాష్ట్రాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన మంత్రి గ్రామసడక్ యోజన కింద మరిన్ని పనులు చేయడం ద్వారా అక్కడ స్థానికులకు ఉపాధి కల్పించేందుకుకృషి చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టెటివ్ కమిటీసమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇళ్లులేని కుటుంబాలు 2.95 కోట్లు ఉన్నాయని చౌదరి బీరేందర్ సింగ్ పేర్కొన్నారు. సామాజికస్థితిగతులు, కుల గణన నివేదికలో ఈ విషయం బహిర్గతం అయిందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 2022 నాటికి అందరికీ ఇళ్లను నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. దీనికిసంబంధించి గ్రామీణ అభివృద్ధి శాఖ కూడా తుది మెరుగులు దిద్దుతోందని చెప్పారు. ఇళ్లసైజు ను 20 చదరపు మీటర్ల నుంచి 25 చదరపు మీటర్లకు పెంచాలని నిర్ణయించామన్నారు.ఇందిరా ఆవాస్ యోజన కింద ఇచ్చే సాయాన్ని దాదాపు రెట్టింపు(రూ.1.5 లక్షలు) చేశామనితెలిపారు. నిర్మించే ఇళ్లలో కనీసం రెండు గదులు ఉండేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం అతిత్వరలో లభించే అవకాశం ఉందని వివరించారు.
వలసలనునివారణకుశ్యామాప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్
దేశంలోగ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలను నివారించే ఉద్దేశంతోశ్యామా ప్రసాద్ రుర్బన్మిషన్కు శ్రీకారం చుట్టామని కేంద్రగ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి చౌదరిబీరేందర్ సింగ్ చెప్పారు. ఇందులోభాగంగా దేశంలో 300 క్లస్టర్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. గ్రామీణప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక, మౌలికవసతుల అభివృద్ధి కి ఇది దోహదపడుతుందన్నారు. 25 వేలనుంచి 50 వేల వరకు జనాభాఉన్న ప్రాంతాలను ఒక క్లస్టర్గాగుర్తిస్తామన్నారు. ఆయా క్లస్టర్లలో వాణిజ్యకార్యకలాపాలు పెరిగేలాచర్యలు తీసుకుంటామనితెలిపారు. దీంతో గ్రామీణ ప్రజలకు ఉపాధిఅవకాశాలు పెరుగుతాయన్నారు. ఒక్కో క్లస్టర్ ను అభివృద్ధిచేసేందుకు దాదాపు రూ.55 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాదిలోదాదాపు రూ.5,041 కోట్లతో 100 క్లస్టర్లనుప్రారంభిస్తామన్నారు. మూడేళ్లలో 300 క్లస్టర్లను పూర్తిచేయడమే లక్ష్యమన్నారు. అతి త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈప్రాజెక్టు మొదలవుతుందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర నిధుల వినియోగ వాటాలో మార్పులు
కేంద్రప్రాయోజిత పథకాలు, ప్రముఖ పథకాల అమలులో కేంద్ర, రాష్ట్రాల నిధుల వినియోగ నిష్పత్తిలోమార్పులు చేసినట్లు చౌదరి బీరేందర్ సింగ్ చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో కేంద్రం వాటా60 శాతం ఉంటుందని, రాష్ట్రాలు 40 శాతం వాటా భరించాల్సి ఉంటుందని వెల్లడించారు.కేంద్ర, రాష్ట్ర నిధుల వినియోగ నిష్పత్తిలో మార్పులు చేసినప్పటికీ కేంద్రం నుంచిరాష్ట్రాలకు వచ్చే నిధులను మాత్రం రూ.15 వేల కోట్ల నుంచి రూ.19 వేల కోట్లకు పెంచామన్నారు. కొండ ప్రాంతాలైన రాష్ట్రాల్లో (ఈశాన్య రాష్ట్రాలు,సిక్కిం, హిమాచల్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్) మాత్రం ఈ నిష్పత్తి 90- : 10 ఉంటుందనిస్పష్టం చేశారు. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానాన్ని పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
పంచాయతీలకు నేరుగా నిధులు
పంచాయతీకుభారీగా నిధులను కేటాయించనున్నట్లు చౌదరి బీరేందర్ సింగ్ వెల్లడించారు. గతంలోకేంద్రం నుంచి రాష్ట్రాలకు, అక్కడి నుంచి జిల్లాలకు అక్కడి నుంచి గ్రామ పంచాయతీలకునిధులు వెళ్లేవన్నారు. ఇక నేరుగా పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.చిన్న పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి 17 లక్షల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.కోటి వరకు నిధులు ఇస్తామన్నారు. 2.46 లక్షల పంచాయతీలకు రూ.2 లక్షల కోట్ల నిధులనుకేటాయిస్తామని తెలిపారు. అయితే ఈనిధులను సమర్థవంతంగా వినియోగించేందుకువీలుగా పంచాయతీలకుసహకరించేందుకు10 వేల మంది బేర్ఫుట్ ఇంజినీర్లను భాగస్వాములను చేస్తామన్నారు.కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రిసుదర్శన్ భగత్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిమహోపాత్ర, తదితరులుపాల్గొన్నారు.