పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
హైదరాబాద్, మే 13, 2017
ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎమ్ యువై) పై నకిలీ వెబ్ సైట్ లకు సంబంధించి ప్రజలకు సలహా
ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎమ్ యువై) కు సంబంధించి ఇటీవల అనేక నకిలీ వెబ్ సైట్ లు పుట్టుకువచ్చిన సంగతి పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది.
www.pmujjwalayojana.com ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన ఆధికారిక వెబ్ సైట్ అని సాధారణ ప్రజలకు అందరి దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రకటనను వెలువరించడమైంది. ఈ ఆధికారిక వెబ్ సైట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోదగ్గ ఫారాలు హిందీలోను ఇంగ్లిషు లోను ఉంటాయి. ఈ ఫారాలను కొత్త ఎల్ పిజి కనెక్షన్ ను కోరుకొనే వారు నింపవలసి ఉంటుంది.
ఆర్ జిజిఎల్ వి యోజన లో భాగంగా ఎల్ పిజి డిస్ట్రిబ్యూటర్ షిప్ నియామకానికి సంబంధించి హిందుస్తాన్ వార్తాపత్రికలో ఒక ప్రకటనను
www.ujwalayojana.org అనే పేరుతో ఉన్న ఎన్ టిటీ జారీ చేసిన విషయం కూడా తమ పరిశీలనకు వచ్చిందని పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ ఎన్ టిటీ ఎల్ పిజి డిస్ట్రిబ్యూటర్ షిప్ ను నియమించడం కోసం పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖ అధికారమిచ్చినటువంటి ఎన్ టిటీ కాదని స్పష్టం చేయడమైంది. ఈ ఎన్ టిటీ జారీ చేసే ప్రకటనకు గాని, లేదా మరే విధమైన సూచనకు గాని ఏ విధంగానూ ప్రతిస్పదించకూడదంటూ సాధారణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడమైందని పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖ వివరించింది.
***