పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము
***
సాంప్రదాయకమైన, ఉత్పాదకమైన ఉద్యోగాల కల్పనలో దుస్తులు మరియుతోలు పరిశ్రమ ప్రాణాధారం: 2016-17 ఆర్థిక సర్వేక్షణ నివేదిక
మన దుస్తులు, మరియు తోలు రంగంప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగేందుకు వీలుగా కార్మిక విధానాలలో మరియు పన్నువిధానాలలో సంస్కరణలు తీసుకురావాలని సిఫారసు చేసిన ఆర్థిక సర్వేక్షణ
దుస్తులు, తోలు, పాదరక్షల రంగాలుఉద్యోగ కల్పనలో ఎంతో అనువైనవని, అంతేకాకుండా పెట్టుబడికి, ఎగుమతులకు మరియు వృద్ధికి సంబంధించిన కొలువులవిషయంలో కూడా ఇవి ఊతమందించగలవని ఆర్థిక సర్వేక్షణ నివేదిక తెలిపింది. ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ఈ రోజు పార్లమెంటుకు సమర్పించిన 2016-17 ఆర్థికసర్వేక్షణ నివేదిక ఈ రంగాలు దేశంలో స్థూలమైన సాంఘిక పరివర్తనకు బాటవేయగలుగుతాయని వివరించింది. బడుగువర్గాలకు, మరీ ముఖ్యంగామహిళకు ఉద్యోగాల కల్పనలో ఈ రంగాలు ప్రాణాధారమైనవని నివేదిక సూచించింది.
చైనాలో పెరుగుతున్నవేతనాలు ఈ రంగాలలోని ఉత్పత్తులకు సంబంధించినంత వరకు చైనా యొక్క మార్కెట్ వాటాస్థిరీకరణకు లోనుకావడానికి గాని, లేదా ఆ మార్కెట్ వాటాను కోల్పోవడానికి గాని కారణమైనందువల్లభారతదేశం తన ఎగుమతులను పెంచుకొనేందుకు ఒక అవకాశం లభించినట్లవుతోందని సర్వేప్రస్తావించింది. చైనా యొక్క పోటీపడే తత్వం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో, భారతదేశంలోనిచాలా రాష్ట్రాలలో వేతన ఖర్చులు తక్కువ స్థాయిలో ఉన్నందువల్ల భారత్ ప్రయోజనం పొందేస్థితికి చేరనుందని వివరించింది.
అయితే, ఈ రంగాలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను కూడా నివేదిక ఒకదానితరువాత మరొకటిగా పేర్కొన్నది. చైనా ఖాళీ చేసిన జాగాను దుస్తుల విషయంలో బంగ్లాదేశ్మరియు వియత్నామ్, తోలు మరియుపాదరక్షల విషయంలో వియత్నామ్ మరియు ఇండోనేషియా ఎంతో వేగంగా ఆక్రమించుకొంటుండగా, భారతీయ కంపెనీలులాజిస్టిక్స్, కార్మిక నియమావళి, పన్నులు మరియుటారిఫ్ విధానాలకు సంబంధించిన ఉమ్మడి సవాళ్ళ పిడికిలో చిక్కి విలవిలలాడుతున్నాయి.దీనితో పాటు పోటీదారు దేశాలతో పోలిస్తే, అంతర్జాతీయ వ్యాపార వాతావరణంలో తలెత్తున్నఅననుకూలతలు కూడా భారతీయ కంపెనీలకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయని నివేదికపేర్కొంది.
లాజిస్టిక్స్ విషయానికివస్తే, ఇతర దేశాల కన్నాభారతదేశంలో కర్మాగారం నుండి గమ్య స్థానాలకు వస్తువులను చేరవేయడంలో వ్యయాలుఎక్కువగా ఉండడంతో పాటు కాలాన్ని కూడా అధికంగా వెచ్చించవలసి వస్తోంది. కనీస ఓవర్‌టైమ్ వేతనం, తప్పనిసరిగాచెల్లించవలసిన వాటా మొత్తాలు వంటి నియమ నిబంధనలు కూడా ఈ రంగంలో భారతదేశానికి సాపేక్షంగాలభిస్తున్నటువంటి ప్రయోజనాన్ని క్షీణింప చేస్తున్నాయని నివేదిక వివరించింది.
దుస్తులు మరియు పాదరక్షలరంగాలలో పన్నులు, టారిఫ్ విధానాలతోసంబంధం ఉన్న కొన్ని నియమాలు భారతదేశం ఎగుమతుల పరంగా సమర్థంగా పోటీ పడలేకపోవడానికికారణమవుతున్నాయి. పత్తి వస్త్రాల పై 6 శాతం టారిఫ్ ఉండగా, ఇతర రకాల దారాలపై10 శాతం టారిఫ్అమలవుతోంది. మరోపక్క దేశీయ పన్నుల విధానం కూడా పత్తి ఆధారిత ఉత్పత్తులకే అనుకూలంగాఉన్నాయి. తోలు విషయానికి వస్తే చర్మ రహిత పాదరక్షల కన్నా, చర్మ సంబంధపాదరక్షలకే దేశీయ పన్నుల విధానం అనుకూలంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పత్తిఆధారిత ఉత్పత్తుల నుండి ఇతర రకాల ఉత్పత్తుల వైపునకు, అలాగే చర్మ రహిత పాదరక్షల వైపునకు మళ్ళుతోందనినివేదిక వివరించింది. ఈ రెండు రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల విషయంలో రెండు ప్రధానదిగుమతి విపణులైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ లలో సున్నా టారిఫ్ లేదా అతితక్కువ టారిఫ్ ల రూపంలో భారత పోటీదారు దేశాలు మరింత విస్తారమైన విపణినిచేజిక్కించుకోగలుగుతున్నాయని సర్వే చెబుతోంది.
భారతదేశంలో పశు సంతతిపెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా పశువుల చర్మానికి సంబంధించిన ఉత్పత్తుల ఎగుమతులుతక్కువగా ఉండటం, భారతదేశంలో పశువధ్యశాలలకు తరలించే పశువుల సంఖ్య అంతకంతకూ క్షీణిస్తూ ఉండటం కూడా తోలు రంగంఎదుర్కొంటున్న మరొక సమస్య అని వివరించారు.
ఈ రంగాలను ప్రపంచస్థాయిలో పోటీపడగలిగేటట్లుగా సన్నద్ధం చేయడానికి మరియు కొత్త ఉద్యోగాల కల్పనలో ఈరంగం సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి సర్వే అనేక సూచనలను, సలహాలనుఇచ్చింది. ప్రపంచ గిరాకీ తీరుకు అనుగుణంగా లేని దేశీయ విధానాలనుక్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందని నివేదిక సిఫారసు చేసింది.
ప్రభుత్వం జౌళి, వస్త్రాల విషయంలో2016 జూన్ లోఆమోదించిన ఒక ప్యాకేజీలో భాగంగా పలు చర్యలను ఇప్పటికే మొదలుపెట్టినట్లు సర్వేగుర్తు చేసింది. తదనుగుణంగా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం జౌళి మరియు దుస్తులసంస్థలకు సబ్సిడీని అందిస్తారు. అయితే దీనికి తోడుగా ఈ కింద పేర్కొన్న ఇతర చర్యలనుకూడా చేపట్టవలసి ఉంటుందంది:
- దుస్తులవిషయానికి వస్తే, యూరోపియన్యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ లతో ఒక స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాన్ని (ఎఫ్ టిఎ) కుదుర్చుకున్నట్లయితేభారతదేశపు పోటీదారులైన బంగ్లాదేశ్, వియత్నామ్, ఇథియోపియా లతో ఇప్పుడున్న ప్రతికూలతలనుఅధిగమిపంచవచ్చు.
- జిఎస్ టినిప్రవేశపెట్టడం వల్ల దేశీయ పరోక్ష పన్నుల క్రమబద్దీకరణలో ఒక చక్కని అవకాశంఅందివస్తుంది.
- కార్మిక చట్టాలలోఅనేక సంస్కరణలు ఈ రెండు రంగాలలోను ఉద్యోగ కల్పనను ప్రోత్సహించగలుగుతాయి.
***