పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము
***
క్రియాశీలమైన ఆర్థిక వ్యవస్థకు మరియు సాంఘిక న్యాయానికిసంస్కరణలు అవసరమని చాటిచెప్పిన ఆర్థిక సర్వే
భారతదేశ ఆర్థిక ముఖచిత్రంలో పరిణామం రాజకీయాలకు అతీతంగాచోటు చేసుకోవలసిన అవసరం ఉంది; ఇది మరిన్ని సంస్కరణలకు అడ్డుపడే స్వార్థపర శక్తులపైపైచేయిని నిరూపించుకోవడం కోసం పరిమితం కాకూడదు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్‌జైట్లీ ఈ రోజు పార్లమెంట్ లో సమర్పించిన 2016-17 ఆర్థిక సర్వే ఈ విషయాన్ని స్పష్టీకరించింది.
భారతదేశం పురోగతిని ఆటంకపరచగల కొన్ని సవాళ్లను ఈ సర్వేక్షణపత్రంలో పేర్కొన్నారు. ఈ సవాళ్లు కింద ప్రస్తావించిన విధంగా ఉన్నాయి:-
• ఆస్తి హక్కులవిషయంలోను మరియు ప్రైవేటు రంగం విషయంలోను అనిశ్చితి;
• ప్రభుత్వ క్షమతలోలోపాలు, ప్రత్యేకించిఅత్యవసర సేవల అందజేతలో న్యూనత మరియు సమర్ధంగా లేని పున:పంపిణీ.
పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ను ప్రయివేటీకరించడంలోని ఇబ్బందులనుసర్వేక్షణ పత్రం ఎత్తిచూపింది. పౌర విమానయానం, బ్యాంకింగ్ మరియు ఎరువుల రంగాలలో మరింతగాప్రయివేటీకరణ జరగవలసిన అవసరం ఉన్నట్లు సర్వేక్షణ పత్రం పేర్కొంది.
ఆరోగ్యం మరియు విద్య వంటి అత్యవసర సేవల అందజేతలో ప్రభుత్వాలసామర్థ్యం బలహీనపడినట్లు సర్వే చెబుతోంది. తక్కువ సామర్థ్యం, అవినీతి ఎక్కువకావటం, క్లయెంటీలిజమ్, నియమావళి మరియుకాలయాపన కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిపింది. రాష్ట్రాల స్థాయిలో, సేవల అందజేతలోపోటీపడటం కన్నా ప్రజాకర్షక విధానాలను పోటాపోటీలు పడి అనుసరిస్తున్నట్లు దాఖలాలుఉన్నాయని సర్వే వివరించింది. నియమాలకు కచ్చితంగా కట్టుబడి ఉండటంచేత విధాననిర్ణయంలో సంయమనం పాటించటం మరియు అధికారగణం విధానాలకు రూపకల్పన చేసేటప్పుడు అధికజాగ్రత యథాపూర్వంగా కొనసాగాలని సర్వే సూచించింది.
సర్వే ప్రకారం, ప్రభుత్వం చేపడుతున్న పున: పంపిణీ ప్రక్రియపేదల వైపు నుంచి చూసినప్పుడు సమర్థంగా కనిపించడంలేదు. ప్రస్తుతం అమలవుతున్నకార్యక్రమాలకు కావలసిందే ఇది. ఎందువల్లనంటే, మెరుగైన సంస్థలు ఉన్న రాష్ట్రాలలో వ్యయం ఎక్కువమొత్తంలో ఉంటుంది కాబట్టి. ఆయా చోట్ల పేదలు తక్కువగా ఉంటారు కాబట్టి అని సర్వేవిశదీకరించింది.
గత రెండు సంవత్సరాలకు పైగా కాలంలో, సబ్సిడీలనుతగ్గించడంలో.. ప్రత్యేకించి పెట్రోలియమ్ ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వం చెప్పుకోదగినపురోగతిని సాధించినట్లు సర్వే ప్రస్తావించింది. ఇవి దారిమళ్లుతున్న సమస్యనుపరిష్కరించడంలో సాంకేతిక విజ్ఞానం ప్రధానమైన ఉపకరణంగా నిలిచింది. ఎరువుల విషయంలోప్రత్యక్ష ప్రయోజన బదిలీకి సంబంధించినంతవరకు అమలుపరచిన ప్రయోగాత్మక పథకాలు ఒకముఖ్యమైన నూతన దిశను ఆవిష్కరించినట్లు కూడా సర్వే వివరించింది.
ఆర్థిక వ్యవస్థ పనితీరు, సంస్కరణల వైపు నుంచి చూస్తే భారతదేశం ఎంతో దూరంపయనించిందని 2016-17 ఆర్థికసర్వేక్షణ పేర్కొన్నది. అయితే ఆర్థిక క్రియాశీలత్వాన్ని, సాంఘికన్యాయాన్ని సాధించడం కోసం యాత్రను కొనసాగించవలసిన అవసరం ఉందన్నది. ఈ యాత్రనుపూర్తి చేయాలంటే, సంఘపరంగా విస్తృతమైనమార్పులను ఆవిష్కరించవలసివుంటుందని సర్వే తెలిపింది.
***