పత్రికా సమాచారకార్యాలయము
భారత ప్రభుత్వము,హైదరాబాద్
***
భారతదేశం అధికవృద్ధి బాటలో పయనించడానికి సిద్ధంగా ఉంది: రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ
హైదరాబాద్, డిసెంబర్ 23, 2016:
భారతదేశరాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు (డిసెంబర్ 23, 2016) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్యం, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఎఫ్ టి ఎ పి సి సి ఐ) శతాబ్ది సంవత్సర వేడుకలకార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగారాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి పథంలో పయనించడానికి సంసిద్ధంగా ఉందని అన్నారు. ‘2008 లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తిన అనంతరం ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థలు ఇప్పటికీ ఇంకా కుంటినడకనే సాగుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం వేగంగాపురోగమిస్తోంద’ని శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మనమందరమూకష్టపడితే భిన్న దేశాల మధ్య మన భారతదేశానికి ఒక సరైన స్థానం దక్కేటట్లుచూడగులుగుతామని రాష్ట్రపతి చెప్పారు. అయితే అదే సమయంలో, ఆరోగ్యం, విద్య, ఉపాధికల్పన, ఆహారం వంటి మానవుల కనీస అవసరాల విషయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించవలసినఅవసరం కూడా ఉందని, అప్పుడు మాత్రమే భారతదేశానికి జనాభాపరంగా ఉన్నప్రయోజనాన్ని పొందడం సాధ్యమవుతుందని రాష్ట్రపతి అన్నారు.
వలస రాజ్య సంబంధిశక్తులను పారదోలిన అనంతరం మనం రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించుకొన్నామని, దీనితో భారతదేశంలో సామాన్యులకు సాంఘిక, ఆర్థికస్వాతంత్ర్యం సంపాదించుకోవలసిన అవకాశం చిక్కిందని రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీవివరించారు. గడచిన మూడు సంవత్సరాలలో భారతదేశపు తలసరి వార్షిక ఆదాయం గ్రేట్ బ్రిటన్‌కన్నా మించిపోయిందని ఆయన తెలిపారు. యునైటెడ్ కింగ్ డమ్ లో భారతదేశపు పెట్టుబడులుసైతం అత్యధిక స్థాయికి చేరుకొన్నాయని, అంతే కాకుండా ఆదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి కూడా అని రాష్ట్రపతి శ్రీ ముఖర్జీచెప్పారు.
కేంద్ర ప్రభుత్వంచేపట్టిన ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ ఇండియా’, ‘స్వచ్ఛ భారత్’ ల వంటి వేరు వేరుకార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు ముందుకు రావాలని సభలోని పారిశ్రామికవేత్తలకు, దేశంలోని కార్పొరేట్ రంగ ప్రముఖులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమాలు గత 15 సంవత్సరాలుగా భారతదేశం పయనిస్తూ వచ్చిన పురోభివృద్ధి పథంలోమరింతగా ముందుకు సాగిపోవడానికి దేశానికి సహాయపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. గత పదిహేనేళ్ల కాలంలో భారతదేశ వృద్ధి రేటు అధికంగా ఉండడం మాత్రమే కాక, 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తాలూకు మిక్కిలి చేటైన ఫలితాల బారి నుండిభారతదేశాన్ని కాపాడింది కూడా ఈ అధిక వృద్ధి రేటే అని రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‌ముఖర్జీ స్పష్టం చేశారు.
***