పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం
****
సేతు భారతం ప్రాజెక్టులో భాగంగా 1500 పాత వంతెనల పునరుద్ధరణ
న్యూఢిల్లీ, నవంబర్ 21, 2016
జాతీయ రహదారుల పై ఉన్న వంతెనల స్థితిగతులను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను నెలకొల్పింది. అలాగే, సేతు భారతం ప్రాజెక్టులో భాగంగా సుమారు 1500 వంతెనల పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ మున్షుక్ ఎల్. మాండవీయ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
****