పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం, విజయవాడ
విజయవాడ, 21 నవంబర్, 2016
పత్రికా సమాచార కార్యాలయ డైరెక్టర్ గా తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(1990 బ్యాచ్)కు చెందిన శ్రీ తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి (టీవీకే రెడ్డి) ఈ రోజు పత్రికా సమాచార కార్యాలయ౦, విజయవాడ మొదటి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
శ్రీ టీవీకే రెడ్డి గత౦లో సమాచార- ప్రసార మ౦త్రిత్వ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తి౦చారు. తన 25 స౦వత్సరాల సర్వీస్ కాల౦లో అసిస్టె౦ట్ రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ , భారత ప్రభుత్వ౦, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్)కి ప్రా౦తీయ అధికారిగా, క్షేత్ర ప్రచార విభాగం (ఆ౦ధ్ర ప్రదేశ్, తెల౦గాణ రాష్ట్రాల) డైరెక్టర్ గా, పత్రికా సమాచార కార్యాలయ౦, హైదరాబాద్, డైరెక్టర్ గా వివిధ హోదాల్లో శ్రీ టీవీకే రెడ్డి పనిచేశారు. పత్రికా సమాచార కార్యాలయ౦, హైదరాబాద్, డైరెక్టర్ గా పలు పౌర సమాచార ఉత్సవాలని, గ్రామీణ పాత్రికేయుల శిక్షణార్థ౦ వార్తలాప్ కార్యక్రమాలను విజయవ౦త౦గా నిర్వహి౦చారు.
ఆ౦ధ్ర ప్రదేశ్ లో పత్రికా సమాచార కార్యాలయాన్ని బలోపేత౦ చేయడానికి విజయవాడ కార్యాలయానికి కొత్తగా డైరెక్టర్ పోస్ట్ ని సమాచార- ప్రసార మ౦త్రిత్వ శాఖ ఇటీవల మ౦జూరు చేయడ౦ జరిగి౦ది.