17 వ తేదీన తిరుపతిలో పాస్ పోర్ట్ మేళా
హైదరాబాద్, అక్టోబర్ 14,2015
హైదరాబాద్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఈ నెల 17వ తేదీన తిరుపతి పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో పాస్ పోర్ట్ మేళాను నిర్వహిస్తుంది. ఈ పాస్ పోర్టు మేళాకు 600 ఆన్ లైన్ అపాయింట్మెంట్లను ఇవ్వనున్నట్లు ఉప పాస్ పోర్ట్ అధికారి ఎల్. మదన్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు దారులు www.passportindia.gov.in వెబ్ సైట్ లో అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అన్ హోల్డ్, వాక్ ఇన్, పీసీసీ, తత్కాల్ దరఖాస్తులను ఈ మేళాలో స్వీకరించబోమని స్పష్టం చేశారు.