పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం
***
పంజాబ్ రాష్ట్రంలో జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్ట్ కేటాయింపు
న్యూ ఢిల్లీ నవంబర్ 1, 2016
జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు నాలుగో దశలో భాగంగా పంజాబ్ రాష్ట్రంలోని జాతీయ రహదారిలో భాగాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులను కేటాయించింది. నెంబర్ 344ఏ జాతీయ రహదారిలో 81 కిలోమీటర్ల రహదారిని రూ. 1444 కోట్లతో అభివృద్ధికి జీఆర్ ఇఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థకు కాంట్రాక్టును కేటాయించారు. ఈ రహదారి ద్వారా అమృత్ సర్, ఛండీఘడ్ ల మధ్య ప్రయాణం సులభతరం కానుంది. ఈ రహదారి ప్రాజెక్టులో ఒక ప్రదాన వంతెన, 22 చిన్న వంతెనలు, నాలుగు ముఖ్యమైన నిర్మాణాలు ఉంటాయి. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా షెడ్యుల్ తయారు చేశారు.