పత్రికా సమాచారం కార్యాలయం
భారత ప్రభుత్వం
***
‘స్వచ్ఛ భారత్’ లో ప్రతి అడుగూప్రధానమే: రాజీవ్ కనకాల
కవాడిగూడలో స్వచ్ఛ భారత్పక్షోత్సవం
హైదరాబాద్, అక్టోబర్ 5, 2016 :
మన పరిసరాలను పరిశుభ్రంగాతీర్చిదిద్దుకోవడంలో మనం వేసే ఎంత చిన్న అడుగైన అత్యంత ముఖ్యమైనదని ఇదే అంతిమంగాస్వచ్ఛ భారత్ కార్యాక్రమం దేశవ్యాప్తంగావిజయవంతం కావాడంలో కీలక పాత్రను పోషించగలుగుతుందని ప్రముఖ సినీ నటుడు శ్రీ రాజీవ్కనకాల అన్నారు. ఆయన బుధవారం స్థానిక కవాడిగూడలోని సిజివో టవర్స్ లో కేంద్రప్రభుత్వసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని గేయ, నాటక విభాగం ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛభారత్ పక్షోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా భేటీబచావో.. భేటీ పడావో.., స్కిల్ ఇండియా వంటి వివిధ కేంద్రప్రభుత్వం పథకాలను గురించి శ్రీరాజీవ్ కనకాల ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇటువంటి పథకాలు విజయవంతంఅవుతాయని గుర్తు చేశారు.
పత్రికా సమాచారం కార్యాలయం, హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ జనరల్డాక్టర్ పి.జే. సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం గాంధీ మహత్ముని స్పూర్తితో చేపట్టిన ‘స్వచ్ఛభారత్’ నేడు భారతదేశానికి ఎంతైనా అవసరమైన అతి ముఖ్యమైన కార్యక్రమం అన్నారు. స్వచ్ఛభారత్ తో పాటు ‘బేటీ బచావో.. బేటీ పఢావో’, ‘డిజిటల్ ఇండియా’ వంటి కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలు భారతదేశంఅభివృద్ధికి ఎంతగానో పాటుపడేవే.. అని ఆయన చెప్పారు. ఈ పథకాలను ప్రజలలోకివిస్తృతంగా చొచ్చుకు వెళ్లేలా ప్రచారం చేయవలసిన అవసరం ఉందని, దానికి గేయ నాటక విభాగం సరైన మాద్యమంఅని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి తన వంతుగా శక్తివంచన లేకుండా ప్రయత్నంచేయాలని అప్పుడే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా అందుకోవడం సాధ్యపడుతుందని తెలిపారు.కుమార్తెలను మొదట రక్షించుకోవాలని ఆ తర్వాతే వారిని చదివించడం కుదిరే పని అని ఆయనచెప్పారు. ఇవాళ మహిళలు ఫైటర్ జెట్ ను నడిపే స్థాయికి సైతం ఎదిగారని ఈ సందర్భంగాడాక్టర్ సుధాకర్ సభికులకు గుర్తు చేశారు. వాయు, జల, భావ కాలుష్యాలనుగురించి కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.
గేయ నాటక విభాగం మేనేజర్ శ్రీ కులదీప్సాగ్రే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి తమ విభాగంవిశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గేయ నాటకవిభాగానికి చెందిన పలువురు కళాకారులు ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ మరియు ‘బేటీ బచావో.. బేటీపఢావో’ పథకాలపై రూపొందించిన ప్రత్యేక సంస్కృతిక అంశాలను ప్రదర్శించి సభికుల కరతాళధ్వనులను అందుకున్నారు. ముఖ్యమంగా గేయ నాటక విభాగం డిప్యూటి డైరెక్టర్ శ్రీ ద్రువఅవస్తీ రచించి దర్శకత్వం వహించిన ‘కఫన్ చోర్’ రూపకం అహ్వానితులను ఆకట్టుకుంది. అదేవిధంగా ‘బాగా బ్రతుకునివ్వండి’ నాటిక స్వచ్ఛ భారత్ మైమ్, మరియు ఇతర ప్రదర్శనలుఅందరినీ ఆలోచింపజేశాయి.