పత్రికా సమాచారం కార్యాలయం
భారత ప్రభుత్వం
***
నైపుణ్యాలఅభివృద్ధి, సాంకేతిక విజ్ఞానసంబంధమైన స్థాయి పెంపుదలలు,
చేతి వృత్తులవారిని అవసరాల మేరకు మరింత వృత్తి నైపుణ్యం కలవారిగా తీర్చిదిద్దగలుగుతాయి
హస్త కళల రంగంకోసం వ్యూహాత్మక ఎగుమతుల నిర్వహణపై నేటితో హైదరాబాద్ లో ముగిసిన సదస్సు
హైదరాబాద్ అక్టోబర్ 5,2016 :
హస్తకళల రంగంలోనిమగ్నమై ఉన్న చేతి వృత్తుల వారు ఇతర నిపుణులు, చిన్న ఔత్సాహిక పారిశ్రామికులలో అవగాహనను మరొకమెట్టు పైకి తీసుకువెళ్లేందుకు, అంతర్జాతీయ విపణిలో ఒక సముచితమైన స్థానాన్నిసంపాదించి పెట్టేందుకు హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఈ పి సి హెచ్ ) చొరవతీసుకొని ఒక సదస్సును ఏర్పాటు చేసినట్లు ఈపిసిహెచ్ ప్రాంతీయ కన్వీనర్ శ్రీ కె.ఎల్రమేష్ తెలిపారు. భారతప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ అధీనంలోని ఈపిసిహెచ్ ఈ సదస్సునుఏర్పాటు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్అన్ని చేతి వృత్తులకు ఒక నిలయంగా ఉందని, అందుకే ఇక్కడ చేతివృత్తులకు సంబంధించినఉత్పత్తుల నాణ్యతను డిజైనింగ్ ను ఇంకా ప్యాకేజింగ్ ను మెరుగుపర్చడంతో పాటుచేతివృత్తుల కళాకారులకు డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఇతర వృత్తి పరమైన మేలకువలపైఅవగాహనను పెంచడం ఈ సదస్సు ఉద్దేశమని శ్రీ రమేష్ వివరించారు.
భారతీయచేతివృత్తుల కళాకారులను మరింత వృత్తి నైపుణ్యం సంతరించుకొన్న వారుగాను, విదేశీమార్కెట్లలో మంచి పోటీని ఇచ్చే వారుగాను సిద్ధం చేసేందుకు వారికి నైపుణ్యాలఅభివృద్ధి, సాంకేతి విజ్ఞాన పరంగా స్థాయిని పెంచడం కోసం తగిన ప్రావీణ్యాలను జోడించవలసినఅవసరం ఎంతైన ఉందని హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్పి. జె. సుధాకర్ అన్నారు.ఈపిసిహెచ్ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన బుధవారం పాల్గొని, ప్రసంగించారు. చేతి వృత్తి కళాకారులకు ఆర్థికసహాయాన్ని అందించడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించవలసిన ఉందని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి పలు పథకాలను అమలుచేస్తోందని ఈ పథకాల నుంచి ప్రయోజనాలు పొందాలని ఆయన వివరించారు. ఈ కళాకారులురూపొందించిన కళాకృతులను ఎగుమతి చేయడం ద్వారా విలువైన విదేశీ మారక ద్రవ్యాన్నిఆర్జించవచ్చని ఆయన గుర్తు చేశారు. ప్రాచీన కాలం నుంచి హస్తకళల తయారీలో మన దేశంఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొందని భారతీయ చేతివృత్తి కళాకారుల ప్రావీణ్యం ఎంత ఘనమైందంటేవారు ఒక అగ్గి పెట్టెలో పట్టగలిగే ఏడు అడుగుల పొడవైన చీరను నేయ గలిగే వారని ఆయనచెప్పారు.
దక్షిణ ప్రాంతంలోఇపిసిహెచ్ ఎగుమతి దారులలో ఒకరైన శ్రీ కె.ఎన్ తులసి మాట్లాడుతూ.. ఒక ఔత్సాహికపారిశ్రామిక వేత్తగా ఎలా ఎదగవచ్చో సదస్సుకు హాజరైన చేతివృత్తుల వారికి వివరించారు.విదేశీ మార్కెట్లలో బాగా డిమాండ్ వున్న వస్తువులను ఎలా తయారు చేయాలి అనే అంశంపైఆయన తనకున్న సుధీర్ఘ అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. రిజీనల్ కో ఆర్డినేటర్శ్రీ దీపేశ్ కుమార్ శర్మ ప్రసంగిస్తూ, సదస్సు లక్ష్యాలను గురించి వివరించారు.సరికొత్త సాంకేతికత, పద్ధతులు, నవీన మార్కెటింగ్ రీతులను గురించిఆయన ఉపన్యసించారు. సుమారు 70 మంది చేతివృత్తుల కళాకారులు జాతీయ పురస్కారగ్రహీతలు, ఎన్టీవోప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు మరియు ఎగుమతిదారులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
***