గోదారి, కృష్ణమ్మను కలిపినఘనత మాదే
పట్టిసీమతో రాయలసీమసస్యశామలం
మహిళా సాధికారతకుప్రథమ ప్రాధాన్యం
సింగపూర్‌లా అమరావతినగర నిర్మాణం
ప్రజలను చైతన్యపరిచే సమాచార ఉద్యమం ఇది
పౌర సమాచార ఉత్సవంముగింపు కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి కె.ఇ.క్రిష్ణమూర్తి
ఎమ్మిగనూరు, అక్టోబరు 9, 2015
ఏటా సముద్రంలోకివృథాగా పోతున్న గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారని రాష్ట్రఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు కె.ఇ.క్రిష్ణమూర్తి అన్నారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులోకేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయంఏర్పాటు చేసిన పౌర సమాచార ఉత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగామాట్లాడారు. పట్టి సీమ ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలో కలిపి అక్కడనుంచి రాయలసీమకు తరలించే భగీరథ ప్రయత్నాన్ని పూర్తిచేసిన ఘనత తమదేనన్నారు.పట్టి సీమ ప్రాజెక్టును తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలప్రజలు అడ్డుకోకుండా వారికి అవగాహన కల్పించిన ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పకుప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నదుల అనుసంధానం జరగాలనిమాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి,దివంగత ఇంజినీర్ కె.ఎల్.రావుకలలు గన్నారని, అయితే ఆ కలలను సాకారం చేసిన ఘనత చంద్రబాబుదేఅన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు.మహిళా సాధికారతకు మొదటి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 24 గంటలునాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం 24వేల రుణ మాఫీ, పింఛన్ల కోసం రూ.6 వేల కోట్లు,బీసీల కోసం సబ్ ప్లాన్నుఅమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
సింగపూర్ మరిపించేలా అమరావతి నిర్మాణం...
సింగపూర్‌ను మరిపించేలానవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్నారనిఉప ముఖ్యమంత్రి కె.ఇ.క్రిష్ణమూర్తి అన్నారు. నవ్యాంధ్రఅభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఎవరుఇచ్చినా స్వీకరిస్తామన్నారు.
పేదల సంక్షేమ కోసం ప్రధాని, ముఖ్యమంత్రి కృషి...
దేశంలో పేదలఅభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర సర్వతోముఖఅభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె.ఇ.క్రిష్ణమూర్తి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణప్రాంత ప్రజలకు తెలియజెప్పేందుకు పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో పౌరసమాచార ఉత్సవాలు జరగడం ప్రశంసనీయమన్నారు. ఇది ప్రజలను చైతన్య పరిచేసమాచార ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. ఎమ్మిగనూరులో మూడు రోజుల ఉత్సవాలనువిజయవంతంగా నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వరరెడ్డి, పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్ టి.విజయ్ కుమార్ రెడ్డినిఅభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, మేకిన్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పేదల కోసమే నా ప్రభుత్వం ఉందని, గ్రామీణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీఅన్న మాటలు దివంగత ముఖ్యమంత్రిఎన్టీఆర్ ను గుర్తుచేశాయన్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే సినీ పరిశ్రమనువదులుకొని ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎన్టీఆర్ సేవలు అందించారనిపేర్కొన్నారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పయనిస్తున్నారనిచెప్పారు. నవ్యాంధ్రను స్వచ్ఛాంధ్రప్రదేశ్గామార్చేందు కోసం ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఇంటికి ఒకమరుగు దొడ్డిని నిర్మించుకోవాలని సూచించారన్నారు. మరుగుదొడ్లు లేని గ్రామాలకుపిల్లలను ఇవ్వొద్దన్నారని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి 7 మిషన్లు, 5 గ్రిడ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రజలంతాసహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
7 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ...
పౌర సమాచార ఉత్సవంముగింపు కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాలకుడీఆర్డీఏ వెలుగు, మెప్మాల ఆధ్వర్యంలోరూ.7 కోట్ల బ్యాంక్ లింకేజీరుణాలను అందజేశారు. ఉపముఖ్యమంత్రులు కె.ఇ.క్రిష్ణమూర్తి, చిన రాజప్పల చేతులు మీదుగా ఈ రుణాల పంపిణీ జరిగింది.
ఎంవీవీఎస్ / ఎస్ ఎస్కే /9-10-15