పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం
***
తెలంగాణ సర్కిల్ నూతన చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ గా చేరిన బ్రిగేడియర్ భువనగిరి చంద్రశేఖర్
హైదరాబాద్, సెప్టెంబర్ 2, 2016:
2016, సెప్టెంబర్ 2వ తేదీన తెలంగాణ సర్కిల్ కు నూతన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గాచేరారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ కు ఆయన మొట్టమొదటి చీఫ్పోస్టు మాస్టర్ జనరల్ గా వచ్చారు. అంతకు ముందు ఆయన లక్నో లోని ఉత్తర ప్రదేశ్సర్కిల్ కు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గా పనిచేశారు.
ఆయన ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1987 బ్యాచ్ కు చెందిన అధికారి. ఇంతవరకు తపాలావిభాగంలో ఆయన 28 సంవత్సరాలసర్వీసును పూర్తి చేశారు. భారతదేశంలో ఆయన ఆర్మీ పోస్టల్ సర్వీసెస్, విజయవాడ ప్రాంతం పోస్టల్ సర్వీసెస్డైరెక్టర్, థాయ్ లాండ్ లోనిబ్యాంకాక్ లో ఉన్న ఏషియన్ పసిఫిక్ పోస్టల్ కాలేజీ లో లెక్చరర్ కమ్ కోర్స్డైరెక్టర్, ముంబయి ప్రాంతంపోస్ట్ మాస్టర్ జనరల్ మరియు న్యూఢిల్లీ లోని డైరెక్టరేట్ ఆఫ్ పోస్టల్ లైఫ్ఇన్సూరెన్స్ లో జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్ & టెక్నాలజీ) వంటి వేరు వేరు పదవులలో సేవలు అందించారు.
***