పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము
ఎన్ ఐ ఆర్ డి & పి ఆర్ లో శిక్షణపొందిన యువతప్రత్యేక సమావేశం
హైదరాబాద్, ఆగస్టు 3,2016:
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డి డి యు – జి కె వై)లో భాగంగా శిక్షణపొంది, ప్రస్తుతం భారతదేశంలోని గ్రామీణాభివృద్ధి రంగంలో పనిచేస్తున్న యువతీ యువకులకుసంబంధించి ఒక పూర్వ విద్యార్థుల సమావేశాన్ని హైదరాబాద్ లోని గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ విషయాల జాతీయ సంస్థ (ఎన్ ఐ ఆర్ డి & పి ఆర్)లో 2016 ఆగస్టు 3న నిర్వహించారు.ఈ కార్యక్రమంలోదేశంలోని వేరు వేరు ప్రాంతాలనుండి 200 మందికి పైగాయువతీయువకులు పాలుపంచుకున్నారు. వారు తమ తమ ఆలోచనలను, తమ అనుభవాలను సాటి అభ్యర్థులకు తెలియజేశారు. తాము శిక్షణపొందిన సంస్థకు మరొకసారి విచ్చేసి తమ తమ విజయ గాథలనువేరే వారితో పంచుకొనే అవకాశాన్ని వారికి ఈ కార్యక్రమం ప్రసాదించింది. డి డి యు- జి కె వైకార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన వారందరూ చక్కని ఉపాధిని పొందగలిగారు. ఆ అభ్యర్థులందరూఒకరి ఆలోచనలను మరొకరికి తెలియజేసుకునేందుకు ఉద్దేశించిన ఈ పూర్వ విద్యార్థుల సమావేశం ఈ కార్యక్రమాన్ని మరింతగా మెరుగుపర్చడానికితగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా ఉద్దేశించినటువంటి సమావేశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అస్సాం ల వంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువతీయువకులు పాలుపంచుకున్న ఈకార్యక్రమం గొప్పగా విజయవంతం అయింది.
ఈ కార్యక్రమాన్నిఎన్ ఐ ఆర్ డి & పి ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు.ఆర్.రెడ్డిప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేశారు. సమావేశానికి తరలివచ్చిన యువత పెద్ద ఆలోచనలుచేయాలని, నిరంతరంనేర్చుకుంటూ తమకు తాము మెరుగులు పెట్టుకోవాలని, ప్రేరణను పొందుతూ ఉండాలనిడైరెక్టర్ జనరల్ తన ప్రసంగంలో యువతకు సలహా ఇచ్చారు.వృత్తి జీవనంలోనూపెద్ద పదవులను అందుకోవాలని,అంతే కాకుండా వారు ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలను పోలి ఉండేసంస్థలను నెలకొల్పడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని యువతకు ఆయ విజ్ఞప్తి చేశారు. యువత తమ మూలాలనుజ్ఞాపకం పెట్టుకోవాలని,తాము వచ్చిన ప్రాంతాలకు తమ వంతు సేవలను అందించడం గురించి ఎల్లప్పుడూ ఆలోచించాలని కూడాఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నడి డియు – జి కె వై సి వొ వొ శ్రీమతి గాయత్రి కాలియా మాట్లాడుతూ, సదస్సుకు వచ్చిన యువతవారి వారి కెరియర్లలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలంటూ అకాంక్షించారు. యువతను ఆమెఅభినందించారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడవలసిందిగా వారికి ఆమె సూచన చేశారు. కార్యక్రమంముగింపు సందర్భంలో, యాజమాన్య సంస్థలు నామినేట్ చేసిన పది మందిఅత్యుత్తమ యువ ప్రతినిధులకు బహుమతులను ఎన్ ఐ ఆర్ డి & పి ఆర్ డైరెక్టర్ జనరల్ మరియు డి డి యు- జి కె వై సి వొ వొ లు ప్రదానం చేశారు.
***