పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం, విజయవాడ
*****
ప్రధాని అధ్యక్షతన రేపు న్యూఢిల్లీ లో 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశం (ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం)
హాజరౌనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,కేంద్ర కేబినెట్ మంత్రులు
పూంఛీ కమిషన్ సిఫార్సుల అమలు, అంతర్గత భద్రత, ప్రత్యక్ష నగదుబదిలీలపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ, 15 జూలై, 2016
పదకొండవ అంతర్రాష్ట్ర మండలి సమావేశం (ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం) రేపు న్యూఢిల్లీ లో జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షత వహించనున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర మండలికి ప్రధాన మంత్రి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. రేపు జరగబోయే 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి వరుసగా 1. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి పూంఛీ కమిషన్ చేసిన సిఫార్సులను అమలుపరచడం, 2. గుర్తింపుకు ఆధార్ వినియోగం మరియు ప్రజాసేవలు, రాయితీలు, ప్రయోజనాలు అందించేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వినియోగం, 3. పాఠశాల విద్య నాణ్యత మెరుగుపరచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మెరుగైన పనితీరుకు ప్రోత్సాహకాలు అందిచడం 4. అంతర్గత భధ్రత మొదలైన అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
పదవ అంతర్రాష్ట్ర మండలి సమావేశం 2006, డిశంబర్ 09వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది. ఈ మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, 06 కేంద్ర మంత్రులు, 11 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు/ కేంద్ర సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) శాశ్వత సభ్యులుగా ఉంటారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆరుగురు కేంద్ర మంత్రులు వరుసగా శ్రీ రాజనాధ్ సింగ్, శ్రీమతి సుష్మా స్వరాజ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ మనోహర్ పారికర్ కాగా, 11 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు/ కేంద్ర సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) వరుసగా శ్రీ సురేష్ ప్రభు, శ్రీ. డి. వి. సదానంద గౌడ, శ్రీ రాంవిలాస్ పాశ్వన్, శ్రీ రవి శంకర్ ప్రసాద్, శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్, శ్రీ జువాల్ ఓరమ్, శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, శ్రీమతి స్మృతి జుబిన్ ఇరీని, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీమతి నిర్మలా సీతారామన్ లు శాశ్వత సభ్యులుగా ఉన్నారు.
........