పత్రికా సమాచార కార్యాలయము
భారత ప్రభుత్వము, హైదరాబాద్
***
హైదరాబాద్, మే 28, 2017
ఉద్యోగ భవిష్య నిధిలో ఈ ఏడాది కొత్తగా 67 లక్షల ఖాతాలు:కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ
-‘తెలంగాణ లో కొత్తగా ప్రారంభించిన ఇపిఎఫ్ఖాతాలు 3 లక్షలు’
- ‘‘కార్మికులకు కనీస పింఛన్ పెంపుప్రతిపాదనపై నిపుణుల సంఘం’’
ఉద్యోగ భవిష్య నిధి(ఇపిఎఫ్) లో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు నూతనంగా 67 లక్షల ఖాతాలుప్రారంభించామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయతెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకుఉద్యోగ భవిష్య నిధిలో 3 లక్షల కొత్త ఖాతాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఉద్యోగ భవిష్యనిధిలో 11 లక్షల 50 వేల కోట్ల రూపాయల నిధి ఉందని, 4 కోట్ల 10 లక్షల మంది కార్మికులుసభ్యులుగా ఉన్నారని శ్రీ దత్తాత్రేయ చెప్పారు. ఎక్స్ చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లో భవిష్యనిధి నిధులను జమ చేయగా, ఇప్పటి వరకు13.72 శాతం వడ్డీ వచ్చిందన్నారు. 2015-16లో రూ. 6,577 కోట్లు, 2016-17 లో 14,982, 2017-18 లో ఇప్పటి వరకు 22,858 కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లు మంత్రి తెలిపారు. మొత్తం భవిష్య నిధుల్లో 5 నుండి 10 శాతం మాత్రమే ఈ ఫండ్స్ లో పెట్టుబడిగాపెడుతున్నామని ఆయన అన్నారు. భవిష్య నిధుల్లో 15 శాతంఎక్స్ చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడిగాపెట్టవచ్చని ఆర్ధిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో కూడా ప్రకటించారనిమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్య నిధులనుఎక్స్ చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడాన్ని మొదట కార్మిక సంఘాలుతీవ్రంగా వ్యతిరేకించాయని, శనివారం పుణే లోజరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో అన్ని కార్మిక సంఘాలు ఈ విధంగాపెట్టుబడి పెట్టడాన్ని స్వాగతించాయని శ్రీ బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రపంచంలోమారుతున్న ఆర్ధిక వ్యవస్థలతో పోటీగా, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా పయనించాలంటే, ఈ విధమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరంఉందన్నారు. సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా ఇంత రిస్క్ లో కూడా 234.86 కోట్ల రూపాయలుడివిడెండ్ లభించిందని మంత్రి వెల్లడించారు. ట్రేడెడ్ ఫండ్స్ నిర్వహణలో సమర్ధంగాపని చేస్తున్న బ్రెజిల్, కెనడా, అమెరికా, సింగపూర్ లలో పర్యటించి మన భవిష్య నిధులను మరింతసమర్ధవంతంగా ఎలా నిర్వహించవచ్చో అధ్యయనం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
యూనివర్సల్ అకౌంట్నంబర్స్ (యుఎఎన్) లో 50 శాతం నంబర్స్ ను ‘ఆధార్’తో ఇప్పటికే అనుసంధానించినట్లు శ్రీబండారు దత్తాత్రేయ తెలిపారు. దేశంలో 8 లక్షల సంస్థలు ఉన్నాయని, 10 కోట్ల మందికి యూనివర్సల్ అకౌంట్నంబర్స్ ను ఇచ్చామన్నారు. రాబోయే రోజులలో సామాజిక భద్రత విషయంలో పెను మార్పులు రాబోతున్నాయని ఆయనవెల్లడించారు. యాజమాన్యాలు, ఉద్యోగులు చెల్లించే ఇపిఎఫ్ వాటాను 12శాతం నుండి 10 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనను పలు సంస్థలు ఒప్పుకోలేదని, తాము 12 శాతం వాటాను కొనసాగిస్తామనిచెప్పడం హర్షణీయమని కేంద్ర మంత్రి అన్నారు. గత మూడు సంవత్సరాలలో ఎన్ డిఎప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల విశ్వాసం పెరిగిందని, మార్కెట్ లో అనుకూల వాతావరణం, పెట్టుబడులకు అవకాశం ఉండడం మూలంగాసానుకూలమైన స్పందన వచ్చిందని శ్రీ దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు భవిష్యనిధి అందించే కనీస పింఛన్ ను 1,000 రూపాయల నుండి 3 వేలరూపాయలకు పెంచాలని కార్మిక సంఘాలు ప్రతిపాదించాయని, దీనిపై ఒక నిపుణుల సంఘాన్ని నియమించి ఒకనిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రాంతీయ భవిష్య నిధికమిషనర్లు శ్రీ శ్రీకృష్ణ, శ్రీ సంజీవ రావు, శ్రీ చంద్రశేఖర్, శ్రీ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
***